KTR: నేను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: కేటీఆర్ సవాల్

  • మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్న కేటీఆర్
  • ఈ మాఫీ చేయలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గితే మోదీ మాత్రం పెంచారని విమర్శ
KTR challenges BJP leaders

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం బడా కార్పోరేటర్లకు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయలేదని నిరూపిస్తే తాను రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మే డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ... కరోనా కాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రధాని మోదీ పట్టించుకోలేదని ఆరోపించారు. కార్మికులను, కర్షకులను మోదీ చావగొట్టారన్నారు. 2014లో మోదీ ప్ర‌ధాని అయ్యే నాటికి ముడి చ‌మురు బ్యారెల్ ధ‌ర 100 డాల‌ర్లు కాగా, ఇప్పుడు 84 డాల‌ర్లుగా ఉందని, కానీ మన వద్ద చమురు ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో పన్నులు పెంచలేదని, కానీ మోదీ మాత్రం పన్నుల మీద పన్నులు వేసి రూ.30 ల‌క్ష‌ల కోట్లు వసూలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాతీయ ర‌హ‌దారుల కోసం సెస్ పెట్టామ‌ని కేంద్రం చెబుతోందని... కానీ ప్ర‌తి జాతీయ ర‌హ‌దారిపై టోల్ వ‌సూళ్లు చేస్తున్నారన్నారు. ఒక వైపు టోల్ మరోవైపు సెస్‌లు గుంజుతున్నారన్నారు. రూ.30 ల‌క్ష‌ల కోట్ల గురించి నిల‌దీస్తే వాస్తవం బయటపడిందన్నారు. బ‌డా కార్పొరేట్లు అయినా అదానీ, అంబానీల‌కు మోదీ ప్రభుత్వం ప‌ద్నాలుగున్నర ల‌క్ష‌ల కోట్ల రుణాలు మాఫీ చేశారన్నారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రేపే రాజీనామా చేస్తానన్నారు.

More Telugu News